calender_icon.png 12 July, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌ను అన్ని రంగాల్లో ముందుంచుతాం

12-07-2025 12:00:00 AM

  1. మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్ 
  2. రూ.5.12 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రూ.5.12 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. షేక్‌పేట్ వార్డులో 315.90 లక్షల వ్యయంతో ఫ్లైఓవర్ క్రింద స్పోరట్స్ పార్క్‌కి, కమ్యూనిటీ డెవలప్మెంట్ , ఫుట్‌పాత్‌తో పాటు హరిజన బస్తీ వద్ద  సిసి రోడ్లు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు.

వెంగల్‌రావునగర్ వార్డులో గురుద్వార్ కమాన్ వద్ద 100.5 లక్షల వ్య యంతో  సిసి రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనచేశారు. యూసఫ్‌గూడ వార్డులో రూ.95.75 లక్షల వ్యయంతో  కమలాపురి అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ పక్కన సీసీ రోడ్ల నిర్మాణలకు  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ను అన్ని రంగాల్లో ముందుంచుతామని తెలిపారు.

ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని సమస్యలు తొలగిస్తున్నామన్నాడు. గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో బస్తీలు, కాలనీలు అభివృద్ధి జరగలేదని విమర్శించారు. హైదరాబాద్‌లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు లేకుండా పరిష్కారం చేస్తున్నామని నగరంలో యువతకు  ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడా నికి ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నామన్నారు.

నగర ప్రజలు ఎక్కడైనా ప్రజా సమస్యలు ఉంటే స్థానిక అధికారి, ప్రజాప్రతినిధుల దృష్టికి లేదంటే మంత్రుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు మా ట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

తాము ఎక్కడికి వెళ్లిన ప్రజలు నాళాలు, సీసీ రోడ్లు, డ్రింకింగ్ వాటర్ సమస్యలను తీర్చమని పబ్లిక్ కోరుతున్నారని  ప్రజా సమ స్యలన్నింటినీ తీరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి అజారుద్దీన్, మేయ ర్ గ ద్వాల విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ దాసరి హరిచందన, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, అధికారులు పాల్గొన్నారు.