calender_icon.png 12 July, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తనాల సేకరణలో ఆసక్తి చూపిన విద్యార్థికి ప్రోత్సాహం

12-07-2025 12:00:00 AM

కొత్తగూడెం, జూలై 11, (విజయ క్రాంతి): విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ-వాతావరణ సమతుల్యత, చెట్ల పెంపకం పట్ల పూర్తి అవగాహన కలిగించాలనే లక్ష్యంతో, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, పాఠశాల విద్యార్థులచే విత్తనాల సేకరణ అనే వినూత్న పథకా న్ని ప్రవేశపెట్టారు. దీనికై బహుమతులను కూడా ప్రకటించారు. కొత్తగూడెం మండలంలోని రెండు కాంప్లెక్స్ లలో రామవరం, కూలీలైన పాఠశాలలు విజేతలుగా నిలువ గా, మండల స్థాయిలో రామవరం ప్రథమ స్థానంలో నిలిచింది.

కాగా కూలీలైన పాఠశా ల 10వ తరగతి విద్యార్థి సంతోష్ కుమార్ స్వయంగా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తూ 30 రకాల విత్తనాలను సేకరించాడననే సమాచారంతో,మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ప్రభు దయాల్, విద్యార్థి గూర్చి తెలుసుకొని ప్రోత్సాహిస్తూ నూతన వస్త్రాలు, స్టడీ మెటీరియల్, బూట్లను బహుకరించారు. తండ్రి కూలీ అయిన తరగతిలో ప్రథమ స్థానంలో నిలవడం పట్ల హర్షం ప్రకటిస్తూ, పట్టుదలతో కష్టపడి చదువుతూ ఉన్నత భవిష్య త్తును సాధించాలన్నారు.