calender_icon.png 20 December, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామానికి సేవకులుగా ఉంటాం..

20-12-2025 12:00:00 AM

బైర మానస - సంతోష్ 

బెజ్జంకి డిసెంబర్19: సర్పంచ్ గా కాదు గ్రామానికి సేవకులుగా వుంటాం అని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం నూతన సర్పం చ్ బైర మానస సంతోష్ అన్నారు.శుక్రవారం విజయక్రాంతి తో మాట్లాడుతూ సర్పంచ్ అనేది పదవి కాదు, ఊరి బాధ్యతనని గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారాలకు కృషి చేస్తానని తెలిపారు.

గ్రామంలోని ప్రతి సమస్యను తనదైన బాధ్యతగా తీసుకుని, మౌలిక వసతుల అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాలు, మహిళల భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తానని పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆశీర్వాదంతో గెలవటం చాల సంతోషంగా వుందని, ఎంఎల్‌ఏ కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథం లో ముందుంచుతూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు.