కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఎండగడుతాం
బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ మంత్రి రామన్న
ఆదిలాబాద్, ఏప్రిల్ 27, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంపై కుట్రలు పన్నుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి, వారి వైఫల్యాలను ఎండగడతామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. బీ.ఆర్.ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు.
అనంతరం పార్టీ కార్యాలయంపై జెం డాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా స్థాపించబడిన బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అలాల్ అజయ్, విజ్జగిరి నారాయణ, దాసరి రమేష్, మెట్టు ప్రహ్లాద్, గండ్రత్ రమేష్, యూనుస్ అక్బని, సెవ్వ జగదీష్, కస్తల ప్రేమల, స్వరూప రాణి, బొడగం మమత తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రంభీం ఆసిఫాబాద్: ప్రజాసంక్షేమం బిఆర్‌ఎస్‌తోనే సాధ్యమని బిఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు జాబరి రవీందర్ అన్నారు.బి ఆర్ ఎస్ 26 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే కోవ లక్ష్మీ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని బిఆర్‌ఎస్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ మండలాధ్యాక్షుడు రవీందర్ ,యువ నాయకుడు కోవ సార్లయినాథ్,మున్సిపల్ చైర్మన్ ఆకాష్,వైస్ చైర్మన్ అహ్మద్ ,నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రాష్ట్ర నాయకురాలు మర్సకోల సరస్వతి, మాజీ సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్,కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, కుర్సెంగ బాలకృష్ణ, రాజం పేట సర్పంచ్ బుర్స పోచయ్య, ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి, నాయకులు నిస్సార్, ఆన్సర్, జీవన్, సాయి శ్రవణ్, నారాయణ, బలరాం నాయక్, అశోక్, ప్రేమ్ కుమార్, ఆశన్న,గిరి, రవి తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణంలో..
నిర్మల్: భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం పట్టణంలోని కొండాపూర్ పార్టీ కార్యాలయంలో సోమవారం జరుపుకున్నా రు. పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తెలం గాణ కోసం అమరులైన వీరులకు నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కెసిఆర్ నాయకత్వంలో ఏర్పడ్డ టిఆర్‌ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మహేష్ రెడ్డి మహేష్, పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
చెన్నూర్ నియోజకవర్గంలో..
కోటపల్లి (చెన్నూర్: చెన్నూర్ నియోజక వర్గంలోని కోటపల్లి మండలం సర్వాయిపేటలో సోమ వారం బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కోటపల్లి మండల సోషల్ మీడియా కన్వీనర్ బాపు నాయక్ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ గ్రామ సీనియర్ నాయకులు ధనం జై, గ్రామ అధ్యక్షులు ఊరటి రాజ్ కుమార్, దుర్గం రాజేందర్, చేడంక రమేష్, దుర్గం కిష్ట స్వామి, గుగ్లోత్ పునం, జిమిడి రాజ బాపు, కోట నాగరాజ్, కార్యకర్తలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.






