11-02-2026 12:41:15 AM
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): పాలమూరులో ఎన్నికల సంఘం సమర్థవంతంగా పనిచేయడం లేదని.. అధికార పార్టీ నేతలు ఏమి చేసినా మౌనంగా ఉండడం ఎంతవరకు సమంజసం అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో అన్ని శాఖలు ఎన్నికల సంఘం పరిధిలో ఉంటాయని, పోలీస్ శాఖ మాత్రం వారి ఇష్టము సారంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ప్రత్యర్ధులు ప్రశాంతంగా ఉండకుండా వారిపై దాడులు చేసి అనవసర రాద్ధాంతాలను సృష్టిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఉన్నత అధికారులు కూడా మౌనంగా ఉండడం ఎంతవరకు సమంజసం అని, ఎన్నికల సంఘం నిర్లక్ష్యానికి సంబంధించి పూర్తి ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు.
ప్రతి పౌరుడు కి స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు కల్పించాల్సిన ఎన్నికల సంఘానికి, బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. దాడులు చేసిన వీడియోలు ఆడియోలు కూడా తమ దగ్గర ఉన్నాయని పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నప్పుడే మంచి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బెక్కం జనార్ధన్, కర్ణాకర్ గౌడ్ తదితరులు ఉన్నారు.