21-08-2025 01:12:38 AM
బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి
నిజామాబాద్ ఆగస్ట్ 20: (విజయ క్రాంతి) : ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి ప్రతి ఇంటికి చేరుకుని నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చి క్రెడిట్ తీసుకుంటోందని విమర్శించారు. నిజామాబాద్ నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం మహాజన సంపర్క్ అభియాన్ జిల్లా సమావేశం జరిగింది.
బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చేర్మెన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు.ఈ సంద ర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, ఇందూరు గడ్డ మీద కాషాయం జెండా ఎగురేయాలని పిలుపు నిచ్చారు.ఎంపీ అర్వింద్ ధర్మపురి. రెండు సార్లు సర్వే నిర్వహించారని, గెలుపు గుర్రాలకే టికెట్ వస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుంది తప్ప వారికీ చేసింది ఏమి లేదన్నారు. ఉప రాష్టపతి అభ్యర్థి గా ఎన్డీఏ నుంచి బీసీ అభ్యర్థిని నిలబడితే కాంగ్రెస్ మాత్రం దిగజారి బీసీ అభ్యర్థిని ఓడగొట్టాలని కంకణం కట్టుకుందన్నారు. కాంగ్రెస్ ఇంకా బీసీల మీద మీ కపట ప్రేమ ఇవ్వడం ఆపాలన్నారు. ప్రతి ఒక్కరు మీ గ్రామాల్లో వెంటనే మహాజన్ సంపార్క్ అభియాన్ పూర్తి చేయాలనీ అన్నారు.
ఈ సందర్బంగా జాతీయ పసుపు బోర్డు చేర్మెన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ బూత్ కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు.పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు.ఎంపీ అర్వింద్ ధర్మపురి గారు కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, వారిని అండగా నిలుస్తున్నారని తెలిపారు.బలమైన బూత్ ఉంటే సర్పంచ్,
ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు గెలవగలమని, ఇందూరు జిల్లాలో జడ్పీ చైర్మన్ పదవీ కైవసం చేస్తామని నమ్మకం వ్యక్తం చేశారు.దొంగ ఓట్ల విషయమై కాంగ్రెస్ అవకతవకలు చేస్తోందని విమర్శిస్తూ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సవాలు విసిరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యేండల లక్ష్మినారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, గోపిడి స్రవంతి రెడ్డి, పోతనకర్ లక్ష్మినారాయణ, న్యాలం రాజు, నాగోళ్ళ లక్ష్మినారాయణ, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.