15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కామారెడ్డి గడ్డ నుంచి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

29-10-2025 07:03 PM

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి గడ్డ నుండి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన బీసీ జేఏసీ సమావేశంలో ఈ నెల 18న జరిగిన బీసీ జేఏసీ బంద్ విజయంలో సమిష్టి కృషి ఉందని అన్నారు. ఈ బంద్ విజయం స్పూర్తితో త్వరలో నిరంతర కార్యాచరణని రూపొందిస్తున్నామని అన్నారు. కామారెడ్డి గడ్డ నుండి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లుని చట్టబద్ధంగా 9వ షెడ్యూల్ లో చేర్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. అగ్రవర్ణ అహంకారుల కుట్రల్ని తిప్పికొట్టే విదంగా, బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా కృషి చేస్తామని అన్నారు. 

అఖిలపక్ష రాజకీయ పార్టీలు చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లకు మద్దతు తెలిపిన నేపథ్యంలో, రిజర్వేషన్లు చట్టబద్ధంగా అయ్యే విధంగా పార్లమెంట్ లో ఆమోదం తెలిపి, 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా ఉద్యమాన్ని చెయాలని అన్నారు. స్థానిక సంస్థల నుండి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు అదే విధంగా విద్యా, ఉద్యోగ రంగాలలో కూడా బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నీల నాగరాజు, సాప శివరాములు, కుంబాల లక్ష్మణ్ యాదవ్, ఎంజీ వేణు గోపాల్ గౌడ్, గణేష్ నాయక్, క్యాతం సిద్ధరాములు, వెంకట్ గౌడ్, మర్కంటి భూమన్న,చింతల శంకర్,రాజన్న, నర్సింలు, బాజ లలిత,కొత్తపల్లి మల్లన్న,మంజుల, అరుణ్, విట్ఠల్, రాజీవ్, రాజేందర్ ,హఫీజ్,శ్రీనివాస్, సాయికృష్ణ,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.