29-10-2025 07:06:20 PM
చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహన్ని చిట్యాల ఎంపీడీఓ జయలక్ష్మి, ఇంచార్జీ తహసిల్దార్ బి.విజయ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి విద్యార్థుల హాజరు, వారికి అందిస్తున్న ఆహర పదార్థాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల విద్యా, ఆరోగ్య పరిస్థితులను, వసతి గృహ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న అనేక వసతులను సద్వినియోగం చేసుకోని భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఆర్ఐ షరీఫ్, హాస్టల్ వార్డన్ కే.ప్రసాద్, ట్యూటర్స్ పట్ల జనార్ధన్, మేడబోయున శ్రీను, బోయ స్వామి, వసతి గృహ సిబ్బంది ఉన్నారు.