calender_icon.png 30 October, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనిటీ మార్చ్ ర్యాలీని విజయవంతం చేయాలి

29-10-2025 06:58:57 PM

కరీంనగర్ (విజయక్రాంతి): ఈ నెల 31న మాజీ ఉప ప్రధాని, ఉక్కుమనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 4:00 గంటలకు తెలంగాణ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు నిర్వహించే యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలని యూనిటీ మార్చ్ జిల్లా ఇన్చార్జి గుజ్జ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్లో పశ్చిమ జోన్ అధ్యక్షులు జాడి బాల్ రెడ్డి కన్వీనర్ అధ్యక్షతన బూత్ ఆ పై స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ 31న నిర్వహించే యూనిటీ మార్చుకు పశ్చిమ జోన్ నుండి ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు కోమాల ఆంజనేయులు, బేతి మహేందర్ రెడ్డి , ఎన్నం ప్రకాష్, బండ రమణారెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, బండారి శ్రీనివాస్, రాగి సత్యనారాయణ, ఈరెడ్డి తిరుమలరెడ్డి, రాయదుర్గం సోమశేఖర్, ఓదెల చందర్, అనుమాల సంపత్, తదితరులు పాల్గొన్నారు.