పశ్చిమను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్, మార్చి 22 (విజయక్రాంతి): ప్రజాపాలనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని 30వ, 59వ డివిజన్లలో సుమారు రూ.85 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సంబంధిత కాంట్రాక్టర్లకు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని సూచించారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడం తన ప్రధాన లక్ష్యమని, ప్రతి వర్గానికీ ప్రయోజనం చేకూరేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, 59వ డివిజన్ ఇంచార్జ్ కేతిరెడ్డి దీపక్ రెడ్డి, 59వ డివిజన్ అధ్యక్షులు పూరెళ్ళి రవి కిరణ్, 58వ డివిజన్ అధ్యక్షులు తాళ్ల పెళ్లి సుధాకర్, కాంగ్రెస్ శ్రేణులు గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి, తెల్ల సుగుణ కిషోర్, దొంగరి శ్రీనివాస్, కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గురుజపల్లి ప్రకాష్ రావు, కాలనీవాసులు సమ్మెట వీరయ్య, పాపిరెడ్డి, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.




