30-07-2025 12:00:00 AM
-సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీలు
-రూ.10,600 కోట్లతో 89.95 లక్షల కార్డులకి దొడ్డు బియ్యం ఇచ్చి మోసం చేసిన ఘనత బీఆర్‌ఎస్ ది
-రూ.13,000 కోట్లతో 97.90 లక్షల కార్డులకు సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిది
-నాడు కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నేటికీ చెక్కు చెదరలేదు.
-రూ.396 కోట్లతో రాజీవ్ గాంధీ దొండపాడు2 లిఫ్ట్‌కు క్యాబినెట్ ఆమోదం
-ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ ఇండ్లు, రేషన్ కార్డులు.
-రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్
హుజూర్ నగర్, జూలై 29 : తెలంగాణ రాష్ట్రంలో పేదవారి కడుపు నింపి ఆహార భద్రత కల్పించే సన్నబియ్యం, నూతన రేషన్ కార్డుల పంపిణిలు గేమ్ చేంజెస్ గా మారనున్నాయని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కౌండిన్య పంక్షన్ హాల్ లో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకి నూతన రేషన్ కార్డులను రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి,ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్,జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ లతో కలిసి పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలోనే హుజూర్ నగర్ నుండి సన్న బియ్యంను ఉగాది పర్వదినం రోజున పంపిణీ చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అలాగే తిరుమలగిరి నుండి నూతన రేషన్ కార్డులు పంపిణి సైతం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా నుండి ప్రారంభం చేయడం అదృష్టం అన్నారు. గతంలో రూ.10,600 కోట్లు ఖర్చు పెట్టి 89.95 లక్షల కార్డులకి 2.80 కోట్ల మందికి దొడ్డు బియ్యం పంపిణి చేసి ప్రజాధనం దుర్వినియోగం చేసిన చరిత్ర బి ఆర్ ఎస్ పార్టీది అన్నారు. పేదవారి కడుపు నింపేలా రూ.13 వేల కోట్లతో 97.90 లక్షల కార్డులకి 3.10 కోట్ల మందికి కేజీ 57 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్న బియ్యం ఉచితంగా పంపిణి చేస్తున్న ఘన చరిత్ర ఈ ప్రజా ప్రభుత్వానిది అన్నారు.
రైతులకి సన్న వడ్లు పండించేందుకు బోనస్ 500 ఇస్తున్నామని, సన్న వడ్లు సేకరించి మిల్లింగ్ చేసి దారిద్య్ర రేఖకి దిగువన ఉన్న వారు కడుపు నిండా తినేలా రాజకీయాలకు అతీతంగా నూతన కార్డులు, సన్న బియ్యం పంపిణి చేస్తున్నామ న్నారు. .హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 11 వేల నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా 52,000 మందికి సన్న బియ్యం తినే హక్కు కల్పించామని తెలిపారు. 18 సంవత్సరాల తర్వాత జూలై మాసంలో సాగునీరు వదలటం జరిగింద న్నారు. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా ఇందిరా గాంధీ ప్రారంభించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు నేటికీ చెక్కు చెదరలేదు అన్నారు.
రూ.396 కోట్ల రూపాయలతో 10,000 ఎకరాలకి నీరు అందించడమే లక్ష్యంగా నిర్మించనున్న రాజీవ్ గాంధీ లిప్ట్ ఇరిగేషన్ దొండపాడు-2 కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింద న్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రములోనే నెంబర్ 1గా చేస్తానని మంత్రి ఉత్తమ్ తెలిపారు.రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి,ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ...గత పాలకులు పదేళ్లు ఒక్క రేషన్ కార్డు, ఇల్లు ఇవ్వలేదని ఇందిరమ్మ రాజ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు.
200 యూనిట్ల కరెంట్, ఉచిత బస్సు, ప్రభుత్వ ఉద్యోగాలు, అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అర్హులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్,సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహన్,జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పి నరసింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ శ్రీనివాసులు, డిఎస్‌ఓ మోహన్ బాబు,సీఐ చరమందరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికఅరుణ్ కుమార్,చక్కెర వీరారెడ్డి, కోతి సంపత్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లిఖార్జున్ రావు,అజీజ్ పాషా పాల్గొన్నారు.
దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్
నకిరేకల్, జులై 29: సమాజంలోని 84 శాతం మంది ప్రజలకు సన్నబియ్యం ఇవ్వడం దేశంలోనే చారిత్రాత్మక, విప్లవాత్మక మార్పు తెలంగాణ రోల్ మోడల్ నిలిచిం దని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రంలో నిర్వహిం చిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదా రులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. నకిరేకల్ నియో జకవర్గంలోని అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు, నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తా నని తెలిపారు. జిల్లాలో ఇరిగేషన్ పనులు అత్యంత వేగవంతంగా చేయిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
రేషన్ షాపు డీలర్లకు ఇచ్చే కమిషన్ విషయం పై ఫైలు సమర్పించాలని వేదికపై ఉన్న ప్రిన్సిపల్ సెక్రెటరీ డిఎస్ జోహార్ ని ఆదేశించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రేషన్ కార్డులు రావడం వల్ల అనేక సంక్షేమ కార్యక్ర మాలు పేదవారికి అందుతాయని అన్నారు. నల్గొండ జిల్లాలో 62,700 మందికి కొత్త కార్డులు ఇవ్వడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సన్న బియ్యంతో పాటు, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, 60 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డిఎస్. చౌహన్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవో వై .అశోక్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి పి ఎస్ సి హెచ్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు. పెద్ది సుక్కయ్య, మాద యాదగిరి, రెడ్డిపల్లి సాగర్, సుంకర బోయిన నరసింహ, కొండ లింగస్వామి . దూదిమెట్ల సత్తయ్య అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ
యాదాద్రి భువనగిరి, జూలై 29 ( విజయ క్రాంతి): రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజు భువనగిరి నియోజక వర్గ పరిధిలోని పోచంపల్లి మండల కేంద్రంలోనీ బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మాట్లడుతూ అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లా డుతూ... ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి అందుతున్నాయని అన్నారు.
అర్హలందరికీ రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వడమే లక్ష్యంగా తీసుకొని ప్రభుత్వం మహిళల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం వచ్చిన మొదటి లోనే మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు.భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రజాపా లనలో బాగంగా పేదలు, రైతులు,పై ప్రభు త్వం అధిక ప్రాధాన్యమిస్తూ అన్ని సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డిఎస్. చౌహన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా బాబురావు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.