20 April, 2026 | 1:41 AM

ముందుగానే ఏర్పాటు చేస్తున్నాం

20-04-2026 12:00 AM

రైతులకు ఎట్టి పరిస్థితులు ఇబ్బందులు రానివ్వం 

ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలన అడుగులు 

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

భూత్పూర్/ మూసాపేట ఏప్రిల్ 19 : రైతులు ధాన్యం విక్రయించేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు రాకూడదని సంకల్పంతో ముందుగానే వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలం పరిధిలో పోతులమడుగు, అన్నసాగర్ గ్రామలలో, మూసాపేట్ మండలం జానంపేట్, కొమ్మిరెడ్డి పల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో పడతాయన్నారు, గ్రేడ్-ఏ రకం (సన్నాలు) ధాన్యం క్వింటాకు రూ.2,389, సాధారణ రకం క్వింటాల్ కు రూ.2,350 మద్దతు ధర ఇస్తామని, సన్నరకం ధాన్యం క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామని పేర్కొన్నారు.

రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని అన్నారు, రైతుల తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్మాలని రైతులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, గన్ని బ్యాగులు అవసరం ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులను కోరారు, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.