మంత్రి సీతక్కపై ఆరోపణలు చేస్తే సహించం
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు
కుమ్రంభీం ఆసిఫాబాద్,జూలై1(విజ యక్రాంతి): అహంకార ధోరణితో రావి శ్రీనివా స్ మంత్రి సీతక్క పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు అన్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ రావి శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలకడంతో పాటు శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలపై తన నివాసం వద్ద మంగళవారం మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గణపతి తో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009, 2014, 2023లలో రంగులు మార్చే ఊసరవెల్లిలా పార్టీలు మారినప్పటికీ కాంగ్రె స్ అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. ఆదివాసి మంత్రిని కించపరిచేలా మాట్లాడడం కుల దురహంకారానికి, పెత్తందారుల పోకడలకు నిదర్శనం అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి కనీసం జెడ్పిటిసికి రావాల్సిన ఓట్లు కూడా తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు. కాం గ్రెస్ హవాలో కూడా అత్యల్ప ఓట్లు తెచ్చుకున్న నాయకుడని అటువంటి వ్యక్తి మంత్రి ని, ఎన్నికల్లో ఆదిలాబాద్ ఇన్చార్జిగా వ్యవహరించిన సత్తు మల్లేష్‌ను విమర్శించే అర్హత లేదన్నారు.
ఎన్నికల్లో ఓటమికి టికెట్ ఆలస్యంగా ఇవ్వడమేనని అంటున్నాడని, అందరికంటే ఆరు నెలల ముందుగా కానీ స్వయంగా రేవంత్ రెడ్డితో మాట్లాడి టికెట్ ఖరారు చేయించానని తెలిపారు. చిన్నారెడ్డి ఇచ్చిన నోటీసుకు కూడా సరైన సమాధానం ఇవ్వకపోవడం ఆయన అహంకారానికి నిదర్శనం అన్నారు. గత నాలుగు నెలల నుండి నియోజకవర్గంలో దొంగల బండికి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఆదివాసి మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.
జైనూర్ లో గతంలో జరిగిన గొడవలకు మంత్రిని బాధ్యురాలుగా చేస్తూ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేదంటే ఆదివాసీల తడాఖా చూపుతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ క్రమశిక్షణ కమిటీ తీసుకున్న చర్యలపై శ్రీనివాస్ పశ్చాత్తాపపడడం లేదని అన్నారు. మంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు, పోలీస్ యాక్షన్ తీసుకునేలా చూడాలన్నారు.
మాజీ జడ్పీ చైర్మన్ గణపతి మాట్లాడుతూ కాగజ్ నగర్ దగ్గర గల వంజిరి, అంకుశాపూర్ ప్రాంతాల్లో ఫ్యాక్టరీ పెడతామని అనుమతుల కోసం మంత్రిని రవి శ్రీనివాస్ అడిగాడని పర్యావరణానికి చేటు చేస్తుందని మంత్రి సీతక్క తిరస్కరించారని దీనితో ఆమెపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వార్డ్ మెంబర్ కూడా కాలేని వ్యక్తికి మూడుసార్లు టికెట్ ఇచ్చిన విషయం మర్చిపోకూడదని ఘాటు విమర్శలు చేశారు. ఆదివాసీలపై అసత్య ఆరోపణలు చేస్తే విజయవాడ వరకు తరిమికొడతామని హెచ్చ రించారు.
కాంగ్రెస్ నాయకులు వసంతరా వు, కెరమేరి మండల నాయకుడు మునీరు మాట్లాడుతూ.. రవి శ్రీనివాస్‌ను శాశ్వతంగా పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఏ సభ్యుడు లావుడ్య రమేష్, మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్, మండల అధ్యక్షుడు చరణ్, అన్ని మండలాల నాయకులు పాల్గొన్నారు.




