02-07-2025 01:35:31 AM
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ఎల్బీ స్డేడియంలో ఈ నెల 4న జరిగే సభ కీలకమైదని, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యే ఈ సభను విజయ వంతం చేసేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేత ల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీధర్‌బాబు ఇతర నేతలు హాజ రయ్యారు. సభ విజయవంతం కోసం నా యకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీ గ్రా మశాఖ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే మాట్లాడటం ముఖ్యమైన అంశమని, ఇది పార్టీ చరిత్రలో ఒక గొప్ప సమావేశమని తెలిపారు. మల్లిఖార్జున ఖర్గే చెప్పే సందేశాన్ని ప్రజలకు చేరవేయాలన్నారు.
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే క్షేత్ర స్థాయిలో పని చేసే పార్టీ కార్యకర్తలతో మాట్లాడనున్నారని తెలిపారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలో పేతం చేయడానికి ఎలా ముందుకెళ్లాలి, అం దుకు తీసుకోవాల్సిన చర్యలపై ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారని చెప్పారు. పీఏసీ సమా వేశంలోనూ అన్ని అంశాలపై చర్చించే అవకాశం ఉంటుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలి పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన కూడా పీఏసీ సమావేశంలో చర్చ ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు సంతో షంగా ఉన్నారని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతి రేక విధానాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్దిని ప్రజలకు వివరించాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎంపీ అని ల్ యాదవ్, చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జ్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, సుధీ ర్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.