calender_icon.png 20 August, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్ల కోసం వలస ఆదివాసీల జీవితాలతో చెలగాటం ఆడితే సహించం

20-08-2025 12:06:46 AM

వలస ఆదివాసులకు కులం సర్టిఫికెట్లు ఇవ్వాలి 

గుర్రాల దుర్గ భవాని బిఎస్పి భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి

చర్ల, ఆగస్టు 19 (విజయ క్రాంతి): ఓట్ల కోసం ఆదివాసి గిరిజనుల చేవితాలతో చెలగాట మాడితే సహించేది లేదని బీఎస్పీ భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ దుర్గ భ వాని అన్నారు. మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ బృందం ఆధ్వర్యంలో వలస ఆదివాసి గ్రామాలను మంగళవారం పర్యటించారు. సింగసముద్రం గ్రామంలో ప్ర జలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా రు. వారు అనేక సమస్యలు పార్టీ దృష్టికి ప్రజలు తీసుక రావడం జరిగింది.

ఈ పర్యటనలో బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి గుర్రాల దు ర్గాభవాని పాల్గొనీ మాట్లాడుతూ గతంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో వలస ఆదివాసుల కులం సర్టిఫికెట్లు రద్దు చేశారని, కొ త్త సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల భద్రాచలం నియోజకవర్గంలోని వలస ఆదివాసి బిడ్డల బ్రతుకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.

ఆదివాసి విద్యార్థుల చదువు లు ఆగమవుతున్నా యని ,ఆదివాసి బిడ్డలు ఉద్యోగాలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసి బిడ్డలకు ఈ రకమైన నష్టానికి కష్టానికి కారణం గతంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు. కచ్చితంగా బిఆర్‌ఎస్ పార్టీకి ఆ పార్టీ నాయకత్వానికి వలస ఆదివాసుల ఉసురు తప్పకుండా తగులుతుందని అన్నారు. ఎన్నికల్లో వలస ఆదివాసులకు కులం సర్టిఫికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించు కొని గద్దె నెక్కిన కాంగ్రెస్ ఈ సమస్య పరిష్కారం కోసం పనిచేయడం లేదని విమర్శించారు.

ఓట్ల కోసం కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు వలస ఆదివాసుల బ్రతుకుల తో చెలగాటం ఆడుతున్న యనీ తక్షణమే వలస ఆదివాసు ల కుటుంబాలకు కులం సర్టిఫికెట్లు జారీ చే యాలనే డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన ఉద్రేదం చే స్తామని హెచ్చరించారు. ఆదివాసీలు వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు తగిన గుణపా ఠం చెప్పాలన్నారు.

బీఎస్పీ మాత్రమే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని భారత రా జ్యాంగ రక్షణకై ఉద్యమిస్తుందని తెలిపారు, భద్రాచల నియోజకవర్గంలోని ప్రాంతం అభివృద్ధి కావాలంటే గిరిజన చట్టాలకు రక్షణ ఉండాలంటే బీఎస్పీకి బహుజన జాతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజ లు ఐక్యమై బిఎస్పీకే అధికారం ఇవ్వాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సామ ల ప్రవీణ్, చర్ల మండలం బిఎస్పి అధ్యక్షులు గోగీకర్ రా, చర్ల మండలం బి ఎస్ పి ఉపాధ్యక్షులు కొండా కౌశిక్, బీఎస్పీ చర్ల మండ లం కార్యదర్శి గుర్రాల విజయ్ కుమార్, చర్ల మండలం బిఎస్పి కోశాధికారి చెన్నం మోహన్, బిఎస్పి చర్ల మండల ఈసీ మెంబ ర్ ఎస్కే జహీరుద్దీన్ భాష తదితరులు పాల్గొన్నారు.