ఆటో డ్రైవర్లను మళ్లీ మోసం చేస్తే ఊరుకోం
ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం
ముషీరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాం తి): ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం డిమాండ్ చేశారు. హామీల అమలులో కాలయాపన చేస్తే తీవ్ర ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. హిమాయత్నగర్లోని సత్యనారాయణ రెడ్డి భవన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వెంకటేశం, ఇతర నేత లను వివిధ ఆటో సంఘాల నాయకులు ఘ నంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఆటో మీటర్ చార్జీల పె ంపు, రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏ ర్పాటు, ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆ ర్థిక సహాయం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ప్ర భుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆటో యాప్ తదితర హామీలను త్వరగా అమలు చేయాలని కోరారు. హామీలు అమలు చేయకపోతే అసె ంబ్లీ, సెక్రటేరియట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఏ. బిక్షపతి యాదవ్, మున్నూరు కృష్ణ, సిహెచ్. జంగయ్య, ఎస్. అశోక్, భా స్కర్, ఘనీ, ఎండి. ఖాజా, ఎం. నరసింహ, ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






