2 July, 2026 | 1:11 PM

Breaking News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. 20 మంది మహిళలు అరెస్ట్‌   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ ఓ వెంకట్   •   కళాశాలల బంద్ విజయవంతం   •   దేవరకద్రలో న్యాయస్థాన భవనం ప్రారంభం   •   కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు   •   పదేళ్ల అప్పుల గురించి కేసీఆర్ చెప్పాలి: మంత్రి జూపల్లి   •   వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   హరీశ్ రావు అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •  

ఎస్సీ, ఎస్టీ భూములు ఆక్రమిస్తే సహించం

16-05-2025 12:00 AM

- మా భూమి రథయాత్రలో విశారదన్ మహారాజ్

బోథ్, మే 15 (విజయక్రాంతి) : ఎస్సీ ఎస్టీ భూములను ఆక్రమిస్తే  సహించేది లేదని, ఆక్రమించే వారు ఎవరైనా ఉపేక్షించమని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్  పేర్కొన్నారు. లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా గురువారం సొనాల మండల కేంద్రంలో పర్యటించారు.

ఈ సందర్భంగా దళితుల స్మశాన వాటిక, బౌద్ధ విహార ప్రాంత భూమినీ సందర్శించి, స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఈ మేరకు విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ.. సొనాలలో దళితుల భూమి పై ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఆ గ్రామంలో  దళితులపై ఉన్న  భూ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

నాడు బీఆర్‌ఎస్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలు  భూముల విలువలు పెరగగానే సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రభుత్వ భవనాల పేరుతో మాల, మాదిగల, మహర్ ల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. ఈ సమస్య అదిలాబాద్ జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా దళితుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంటుందని దీనిపై భారీ భూ పోరాటం చేస్తామన్నారు.

బీసీ ఎస్సీ ఎస్టీల భూముల రక్షణ కోసం విద్యా వైద్యం ఉపాధి భూమిని సాధించడం కోసం లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర చేపట్టినట్లుగా వివరించారు. అన్ని రంగాల్లో అశ్రద్ధ చేస్తున్న ప్రభు త్వాన్ని దోషిగా చూపించడమే కాకుండా ఈ జిల్లా ప్రజలకు అందాల్సిన వాటా వివిధ రంగాల్లో సంక్షేమ బడ్జెట్ అందే విధంగా మాభూమి రథయాత్ర  ద్వారా ప్రశ్నించడమే కాకుండా పోరాటం చేస్తుందన్నారు.

10% లేని రెడ్డి వెలుమ ల రాజ్యం ఇక మనకవసరం లేదని మన బీసీ ఎస్సీ ఎస్టీలను అధిగారణకి తీసుకురావడానికి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నా యకులు అన్నెల లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్, సొనాల మండల అధ్యక్షులు కొండ మడుగు గణేష్, నాయకులు శ్రీనివాస్, అశోక్,  శ్రీనివాస్, నరేష్ రాకేష్  వివిధ కులాల నాయకులు పాల్గొన్నారు.