రైతు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
16-05-2025 12:00 AM
మెదక్, మే 15(విజయక్రాంతి):హవేళీఘణపూర్ మండలం వాడి గ్రామానికి చెందిన రైతు లింగం ఎల్లయ్య గురువారం ఉదయం పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించడం జరిగింది. ఈ విషయం నాయకుల ద్వారా తెలుసుకున్న మెదక్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ జిల్లా ఆసుపత్రి మార్జరీలో ఉన్న ఎల్లయ్య మృతదేహాన్ని పరిశీలించారు,
అనంతరం మృతుడి భార్య రాజమణిని ఓదార్చి మనోధైర్యాన్నిఇచ్చారు. తక్షణ సహాయం కింద రూ.5000/- అందజేశారు. వీరి వెంట మెదక్ జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి. వాడి మాజీ సర్పంచులు యామిరెడ్డి, సుభాష్ రెడ్డి, మాజీ ఎంపిటిసి బిక్షపతిరెడ్డి ఉన్నారు.






