calender_icon.png 28 July, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌడ కులస్తులను కల్తీకల్లు పేరిట వేధిస్తే ఊరుకోం..

28-07-2025 12:00:00 AM

జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగోల్ల మురళి గౌడ్ 

కామారెడ్డి, జూలై 27 (విజయ క్రాంతి) ః కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో గౌడ బిడ్డల భాగస్వామ్యం ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు అని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. గౌడ కులస్తులను కల్తీకల్లు పేరిట వేధిస్తే ఊరుకోం అని హెచ్చరించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ రాష్ర్టంలోని అన్ని గ్రామాలకు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని అయన ప్రభుత్వాన్ని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో గౌడ బిడ్డల భాగస్వామ్యం ఉందనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు.  ఎక్సుజ్ అధికారుల తీరును నిరసిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. కల్తీ కళ్ళు పేరిట వేదిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్సుజ్ అధికారులతో ఎన్నడూ లేని విధంగా కల్తీ కల్లు పేరిట దాడులు చేయడం తగదని హెచ్చరించారు. కల్తీ కల్లు పేరిట గౌడ వృత్తిని నిర్వీర్యం చేసి లిక్కర్ మాఫియా కు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ విధంగా దాడులుచేస్తే గౌడబిడ్డలు చూస్తూ ఊరుకోరని తిరుగుబాటుకు సిద్ధమవుతారని ఆయన హెచ్చరించారు.