28-07-2025 12:00:00 AM
-మర్కుక్‌లో అలుగు పారుతున్న 14 చెరువులు కుంటలు
-జగదేవపూర్‌లో 6 చెక్ డ్యాములు, ఒక చెరువు
గజ్వేల్, జూలై 27: గత మూడు రోజులుగా కురుస్తున్న మోస్తారు వర్షానికే గజ్వేల్ డివిజన్లోని మర్కుక్ జగదేవపూర్ మండలాల్లో చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు నిండి అలుగు పారుతున్నాయి. జగదేవపూర్ మండలంలోని ఇటిక్యాల వద్ద కూడవెల్లి చెక్ డ్యామ్, పీర్లపల్లి గ్రామ పరిధిలోని 5 చెక్ డ్యామ్, కొత్త పేట దేవతల కుంట వర్షపు నీటితో నిండి అలుగు పారుతున్నాయి.
మర్కుక్ మండలం మర్కుక్, శివారు వెంకటాపూర్, వరద రాజ్ పూర్ గ్రామాలలోని కోణం చెరువు, పాండురంగ సాగర్, చిట్టేడి కుంట, తిప్పనివాని కుంట, రాగి కుంట, బ్రాహ్మణ కుంట, బోరుగుల కుంట, బంజారు కుంట, ఉడుతోని కుంట, జెనిగల కుంట, ముల్లోని కుంట, పూస రాముల కుంటలు గత మూడు రోజులుగా కురిసిన వర్షానికి నిండి అలుగు పారుతున్నాయి. కాగా మర్కుక్ మండలంలో 100, జగదేవపూర్ లో 92 చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు ఉండగా, ఇదే స్థాయిలో వర్షం కురిస్తే మరికొన్ని నిండే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు.