calender_icon.png 28 July, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్లక్ష్యపు నీడలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్లర్లు

28-07-2025 12:00:00 AM

బిచ్కుంద జులై 27  ః కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం వెనకాల విద్యుత్ ట్రాన్స్ ఫార్లర్లు ప్రమాదకర స్థితిలో దర్శనమిస్తున్నాయి. తక్కువ ఎత్తులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్లర్లు ఏర్పాటు చేయడంతో గతంలో గేదె విద్యుత్ ఘాతానికి గురైంది. మరిన్ని ప్రమాదాలు సంభవించక ముందే సంబం ధిత అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.