29 April, 2026 | 3:24 AM

మంత్రి ఉత్తమ్ అసత్య ఆరోపణలు చేస్తే సహించం

29-04-2026 12:55 AM

యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్‌అజీమ్

కోదాడ, ఏప్రిల్ 28: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పై బీఆర్‌ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి చేసిన విమర్శలను కోదాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. మంగళవారం కోదాడలో నిర్వహించిన సమావేశంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ అజీమ్ మాట్లాడుతూ రాజకీయ ఉనికి కోసమే నరసింహారెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తెలంగాణ భవన్ వేదికగా ఇటువంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రిపై చేసిన వ్యాఖ్యలకు నరసింహారెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నడిగూడెం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుండు మహేందర్, మునగాల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెళ్ళపాటి సాయి, కోదాడ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తోళ్ల ఆనంద్, యువజన కాంగ్రెస్ నాయకులు షేక్ నాగుల్ పాషా, సయ్యద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.