29 April, 2026 | 2:55 AM

విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలి

29-04-2026 12:55 AM

పోచారం ఇన్స్‌పెక్టర్ కనకయ్య

ఘట్ కేసర్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : విద్యార్థులు క్రమశిక్షణతో, బాధ్యతతో సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలని  పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కనకయ్య అన్నారు. యువతలో డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలు ఇతర అక్రమ కార్యకలాపాల పట్ల అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో అనురాగ్ యూనివర్సిటీలో డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి  పోచారం ఐటీ కారిడార్ ఇన్స్పెక్టర్ కనకయ్య, సబ్ ఇన్స్పెక్టర్ విజయ్, భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఇన్స్పెక్టర్ కనకయ్య మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక చట్టపరమైన దుష్పరిణామాలను వివరించారు.

అలాగే యువత సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువతే దేశానికి శక్తి భవిష్యత్తు అని పేర్కొంటూ, విద్యార్థులు క్రమశిక్షణతో, బాధ్యతతో సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలని ప్రేరణనిచ్చారు. ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు విద్యార్థులు తమ పరిసరాల్లో జరిగే అనుమానాస్పద లేదా అక్రమ కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండి, అవసరమైతే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. దేశాభివృద్ధికి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ వి. విజయకుమార్ సమక్షంలో నిర్వహించబడగా, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ, ఇతర ఎన్‌ఎస్‌ఎస్ ట్రైనర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.