26 August, 2026 | 3:53 AM

కులగణన చేపట్టకుంటే బీజేపీని దింపేస్తాం

26-08-2026 01:36 AM
  1. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక
  2. బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీవ్రతరం చేస్తాం
  3. సిరికొండ మధుసూదనా చారి, వీ శ్రీనివాస్ గౌడ్ 
  4. గన్ పార్క్ వద్ద బీపీ మండల్ 109వ జయంతి

ముషీరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాం తి): బీసీ కులగణన చేపట్టకుండా కేంద్ర ప్ర భుత్వం వ్యవహరిస్తే దేశవ్యాప్తంగా బీసీలను ఏకం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య క్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించా రు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం ఆ ధ్వర్యంలో గన్‌పార్క్ వద్ద బీసీ సంక్షేమ సం ఘం ఆధ్వర్యంలో బీపీ మండల్ 109వ జ యంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

కేంద్రం చేప డుతున్న జనగణనలో బీసీల కుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని, ప్రతి కు లానికి ప్రత్యేక కోడ్ కేటాయించాలని డిమా ండ్ చేశారు. మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ ఆమో దం పొందేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నా రు.

బీఆర్‌ఎస్ శాసనమండలి పక్ష నేత, మా జీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడు తూ.. బీసీల జనాభా లెక్కలు తేలితే రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందనే భయంతోనే కేంద్రం వెనుకడుగు వేస్తోందని ఆరోపించా రు. బీసీ కులగణన చేపట్టకపోతే దేశవ్యాప్తంగా బీసీల ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ జాక్ వైస్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ కులాల జేఏసీ చై ర్మన్ కుందారం గణేష్ చారి, నాయకులు క నకాల శ్యామ్ కుర్మా, గొడుగు మహేష్ యా దవ్, ఉప్పరి శేఖర్ సగర, కాటేపల్లి వీరస్వా మి తదితరులు పాల్గొన్నారు.