10 March, 2026 | 4:04 AM

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు అడ్డుకుంటాం

09-03-2026 09:15 PM

మున్సిపల్ కమిషనర్

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సర్వేనెంబర్ 111 ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటామని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వేనెంబర్ 129,130లలో మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఆయన టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణాల కోసం ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పనులను అడ్డుకొని పనులు ఆపేయాలని నిర్మాణ దారులను ఆదేశించారు.  మరోవైపు ఆర్డిఓ కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 111 ప్రభుత్వ భూమి లో సైతం జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటామని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. తెలిపారు