5 June, 2026 | 2:34 AM

వ్యవసాయ శాఖ భూములను కాపాడుతాం

05-06-2026 12:25 AM
  1. ఐఏఎస్‌లతో ప్రత్యేక కమిటీ  
  2. మంత్రి తుమ్మల 

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి) : వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులను ముందుగానే సన్నద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ ఖాళీ భూముల పరిరక్షణకు ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఖాళీ స్థలాల్లో ప్లాంటేషన్ లేదా లీజు ద్వారా ఆదాయం సమీకరణ చే యాలని అధికారులకు సూచించారు.

గురువా రం హైదరాబాద్‌లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  ఎల్-నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, ప్రత్యామ్నాయ పంటల సాగుపై గ్రామ సభల్లో రైతులకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. తక్కువ నీటితో పంటల సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. పంటల అవశేషాలను కాల్చకుండా చూడాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాటిలైట్ ఆధారితంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు.  

కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్

కోహెడలో రూ. 2,284.32 కోట్ల వ్యయం తో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్ల మార్కెట్ నిర్మాణం చేస్తున్నట్లు మంత్రివివరించారు. జూన్ 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఫెర్టిలైజర్ యాప్ విషయంలో తెలం గాణ ప్రభుత్వంపై కేంద్రం మరోసారి ప్రశంసలు కురిపించిందన్నారు. తెలంగాణ ఎరువుల పర్యవేక్షణ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.