5 June, 2026 | 2:32 AM

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

05-06-2026 12:23 AM

నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండ టౌన్, జూన్ 4: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం నల్లగొండ కార్పొరేషన్ లోని 10,11, 31, 32,,33,34,41 వ డివిజన్ లలో స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలను అందించి ఆర్థికంగా బలోపేతం చేస్తుందన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను మరింత అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. అన్ని డివిజన్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాలు, అందజేయడం జరుగుతుందని తెలిపారు. నగరంలో విద్యుత్ లో వోల్టేజ్ ను త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నీటి ట్యాంకులు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. 24 గంటలు తాగునీటిని సరఫరా కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ లు పాలకూరి సుమలత సంతోష్ గౌడ్, పిల్లి కృష్ణంరాజు, కౌసర్, రేగట్టే అండాలు లింగస్వామి, ఏదుళ్ళ శ్రీధర్ రెడ్డి, కేసాని వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ప్రదీప్ నాయక్, జానయ్య, నాయకులు దోనాల నాగార్జున రెడ్డి, నకిరేకంటి సైదులు, రాక్ హిల్స్ కాలనీ అధ్యక్షులు సోమన బోయిన నరసింహ యాదవ్ ఆబిద్ ఫకీర్ వెంకటరెడ్డి అంజయ్య సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.