calender_icon.png 12 February, 2026 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్ పరిధి మార్చే వరకు ఉద్యమిస్తాం

12-02-2026 01:00:08 AM

అడ్డగుట్ట డివిజన్ హక్కుల పరిరక్షణ కమిటీ

సికింద్రాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): సికింద్రాబాద్ లోని అడ్డగుట్ట ను తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో యధావిధంగా కొనసాగిస్తామని అధికారికంగా జీవో ఉత్తర్వులు విడుదల చేసేవరకు తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని అడ్డగుట్ట డివిజన్ హక్కుల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఉన్నారు. తుకారంగేట్ లోని వెంకట నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ పునర్విభజనలో భాగంగా అడ్డగుట్ట డివిజన్లోని అనేక ప్రాంతాలను లాలాగూడ పోలీస్ స్టేషన్లో కలపడం వల్ల స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్న ఈ నేపథ్యంలో ఆదివారం శాంతి ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.అడ్డగుట్ట లోని ప్రజలు దుకాణదారులు స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.

ఎట్టకేలకు స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు అడ్డగుట్ట ప్రాంతాలను తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ లో యధా విధంగా కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. అందుకు సంబంధించి వారం రోజుల్లో జీవో తో నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని అడిషనల్ డీసీపీ  నరసయ్య చెప్పినట్లు తెలిపారు. ఈ మేరకు నిరసన కార్యక్రమాలను తాత్కాలికంగా విరమించుకుంటున్నా మని అన్నారు. వారం రోజుల తర్వాత తమ డిమాండ్ కు తగిన నోటిఫికేషన్ జారీ చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అడ్డగుట్ట డివిజన్ హక్కుల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.