calender_icon.png 24 October, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెప్మా ద్వారా సహాయ సహకారాలు అందిస్తాం..

23-10-2025 10:34:30 PM

మున్సిపల్ కమీషనర్ జాదవ్ కృష్ణ..

బోధన్ (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ టార్గటేడ్ ఇంటర్వెన్షన్(హెచ్ఐవి నివారణ) ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అడ్వకేసి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ హాజరై మాట్లాడారు. మహిళా స్వచ్ఛ వర్కర్లు తమ వృత్తిని ఎన్నో ఇబ్బందులకు గురవుతూ నిర్వహించాల్సి ఉంటుందన్నారని, వారు వృత్తి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా వృత్తి నుంచి విరమించుకొని వేరే వృత్తిని ఎంచుకున్నట్లయితే వారికి మెప్మా ద్వారా వృత్తిశిక్షణను ఏర్పాటు చేసి వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకొని కొంతమంది వ్యాపారాలు నిర్వహిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని వెంటనే ఆక్రమణలపై రిపోర్టు ఇవ్వాల్సిందిగా సిబ్బందిని తాను ఆదేశించానని త్వరలోనే అక్రమ ఆక్రమణలను తొలగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన పట్టణ సిఐ వెంకట్ నారాయణ మాట్లాడుతూ మహిళా సెక్స్ వర్కర్లు సత్ప్రవర్తనను కలిగి వారి వృత్తిని కొనసాగించాలని ఎప్పుడైనా శాంతి భద్రతలకు భంగం వాటిల్లితేనే చర్యలు తీసుకుంటామన్నారు. సెక్స్ వర్కర్ల పిల్లలు ఎవరైనా మంచి చదువులు చదివి ఉంటే ఉద్యోగాలు కానీ, వృత్తి శిక్షణ కానీ అవసరమైనట్లయితే స్నేహ సొసైటీని సంప్రదించి తమ సహకారాన్ని కూడా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రి కన్స్ట్రక్షన్ కార్యదర్శి సిద్దయ్య, పట్టణ ఎస్ఐ భాస్కరాచారి, ఏఎస్ఐ, బోధన్ ఫ్రూట్ వండర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ నయీమ్, స్నేహ టిఐ కౌన్సిలర్ అన్విత, జిఎన్ఎమ్ మౌనిక, అవుట్ రీచ్ వర్కర్లు పీర్ ఎడ్యుకేటర్లు, మహిళా సెక్స్ వర్కర్లు పాల్గొన్నారు.