23-10-2025 10:38:18 PM
చిట్యాల (విజయక్రాంతి): ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని తండ్రి మందలించగా మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామానికి చెందిన రుద్రారపు చందు(25) వృత్తిరీత్యా ట్రాక్టర్ మెకానిక్ గా పనిచేస్తూ ప్రతిరోజు చిట్యాలలో గల మెకానిక్ షాప్ కు వెళ్లి వస్తుండేవాడు. ఈ మధ్యన గత కొన్ని రోజులుగా తరచూ రాత్రి సమయంలో ఆలస్యంగా ఇంటికి వస్తుండగా, తండ్రి తన కుమారుడిని సమయానికి భోజనం చేయకుండా ఆలస్యంగా ఎందుకు వస్తున్నావు అని మందలించగా మనస్తాపానికి గురై చందు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి పురుగుల మందు తాగి పెద్దకాపర్తి సబ్ స్టేషన్ వద్ద పడి ఉన్నట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందగా వెంటనే చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా గురువారం మధ్యాహ్నం మృతిచెందాడని తండ్రి రుద్రారపు బిక్షం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు.