calender_icon.png 24 October, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి

23-10-2025 10:29:26 PM

హెల్పింగ్ హాండ్స్ సంస్థ ప్రతినిధులు చిత్రాల చిన్న. ప్రమోద్ పిలుపు..

బోధన్ (విజయక్రాంతి): రక్తదానం చేసి ప్రాణదాతలు కండి అని హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు చిత్రాల చిన్న ప్రమోద్ యువకులకు పిలుపునిచ్చారు. గురువారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో గల రక్త నిల్వ కేంద్రంలో రక్త దానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హాండ్స్ సంస్థ ప్రతినిధులు, యువకులు విచ్చేసి పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చిత్రాల చిన్న మాట్లాడుతూ హెల్పింగ్ హాండ్స్ సంస్థలో యువకులు చేరి రక్తదానం కు ముందుకు రావాలని కోరారు. రక్త నిల్వ కేంద్రంలో రక్త నిల్వల కొరత ఏర్పడడంతో రెండు, మూడు నెలలకోసారి రక్త దానం చేయడం జరుగుతుందన్నారు. రక్త దానం చేస్తే మరొకరి ప్రాణం కాపాడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగవేంద్ర అక్షయ పటేల్, శివ, కేశవ, జియోల్, సాత్విక్, నవీన్, శివ, శివరాజు తదితరులు ఉన్నారు.