16 April, 2026 | 3:12 AM

ప్రతి పల్లెలో బీసీల జెండాను ఎగురవేస్తాం

09-05-2025 12:38 AM

ఆదిలాబాద్, మే 8 (విజయక్రాంతి): ఈ దేశానికి మూల నివాసులైన ప్రజలు మెజారిటీ ప్రజలు బీసీలేనని బీసీ ఆజాది ఫెడ రేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జక్క ని  సంజయ్ కుమార్  అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన 42% రిజర్వేషన్ బిల్ అమలు చేయాలని, దేశ వ్యాప్తం గా కుల గణన ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో వెంటనే చేపట్టాలని బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీసీ మేలు కోలుపు రథయాత్ర గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఫూలే చౌరస్తా లో జరిగిన కార్య్రమంలో  ప్రజా సంఘాలు, కుల సంఘాలు హాజరై రథయాత్రకు ఘన స్వాగతం పలికారు.  

ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ సామాజిక రంగాలలో మేమెంతో మాకంత వాటాను సాధించినప్పుడే నిజమైన విముక్తిని సాధిస్తామని బీసీల అభి వృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు.

ప్రతి పల్లెలో బీసీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుదీర్ఘకాలం పాటు బీసీ మేల్కొకొలుపు రథయాత్రను ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో వారి స్వ గ్రామంలో ప్రారంభించడం జరిగిందని ఈ యాత్ర అలంపూర్‌లో ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే, బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు మాచర్ల శ్రీనివాస్, నామాని అర్జున్, స్థానిక కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.