calender_icon.png 13 May, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తి పన్ను వసూళ్లలో ఆర్మూర్ ముందజ

09-05-2025 12:39:17 AM

అర్మూర్, మే 8 (విజయ క్రాంతి) : ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను బకాయి దారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎర్లీ బర్డ్ పథకం కింద కల్పించిన ఐదు శాతం రాయితీని ఆర్మూర్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడం జరిగింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా 40 శాతం ఇంటి యజమానులు ఆర్థిక సంవత్సరం మొదటి మాసంలోనే ఐదు శాతం రాయితీని ఉపయోగించుకొని తమ ఆస్తి పన్నులు చెల్లించడం జరిగింది. 7.33 కోట్ల లక్షల డిమాండ్ కు గాను, 2. 35 కోట్ల రూపాయలు వసూళ్లు చేయడం జరిగింది.

32.06%తో రాష్ట్రంలోనీ 151 మున్సిపాలిటీల్లో 16వ స్థానంలో, ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. వార్డ్ అధికారులు, బిల్ కలెక్టర్ల నిరంతర కృషి మూలంగానే ఈ వసూళ్లు కావడం జరిగింది. అలాగే పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ ఆస్తి పన్నులు ముందస్తుగానే చెల్లించినందుకు, వారందరికీ కూడా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. 

కొత్త ట్రేడ్ లైసెన్సుల జారీలో మెరుగుదల

గతంలో పట్టణ పరిధిలో ట్రేడ్ లైసెన్సులు కేవలం 1300 వరకు మాత్రమే ఉండేవి. వాటి ద్వారా సుమారు 20 లక్షల ఆదాయం మున్సిపాలిటీకి వచ్చేది. పట్టణంలో ఉన్న కమర్షియల్ ప్రాధాన్యతను గుర్తించి, ట్రేడ్ లైసెన్స్ టీమ్ లను పది మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది.

నిరంతర ప్రయత్నాల మూలంగా ఒక సంవత్సరం వ్యవధిలోనే సుమారు 1200 ట్రేడ్ లైసెన్స్ లు కొత్తగా జారీ చేయడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 65 లక్షల రూపాయల ఆదాయం ట్రేడ్ లైసెన్స్ల రెన్యువల్ మరియు కొత్త ట్రేడ్ లైసెన్సుల జారీ ద్వారా మున్సిపాలిటీకి లభించింది. ట్రేడ్ లైసెన్స్ టీం నిరంతర ప్రయత్నాలు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారి నిరంతర పర్యవేక్షణ అన్నింటికంటే ముక్యంగా పట్టణ దుకానుదారుల సహకారం మూలంగానే మూడున్నర రెట్ల ఆదాయం అదనంగా మున్సిపాలిటీకి చేకూరడం జరిగింది.

భూమి క్రమబద్ధీకరణ పథకం క్రింద మున్సిపాలిటీకి ఆదాయం

భూమి క్రమబద్ధీకరణ పథకం కింద 2020 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు అందరూ కూడా, ప్రభుత్వం కల్పించిన 25% రాయితీని ఉపయోగించుకుని పెద్ద మొత్తంలో తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడం జరిగింది.

సుమారు 1200 మంది ప్లాట్ల యజమానులు తమ ప్లాట్లకు సంబంధించిన ఫీజు చెల్లించడం ద్వారా ప్రభుత్వానికి 4.6 కోట్ల ఆదాయం సమకూరడం జరిగింది. ఇప్పటివరకు, ఫీజు చెల్లించిన వారిలో 701 మందికి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన వారికి కూడా నిబంధనల ఆధారంగా పరిశీలించి అర్హులైన అందరికీ కూడా ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరుగుతుంది.