1 August, 2026 | 10:38 PM

చెంచు మహిళను పరామర్శించిన మంత్రి జూపల్లి

22-06-2024 06:52 PM

నాగర్ కర్నూల్ : జిల్లా ఆసుపత్రిలో మొలచింతలపల్లి పాశవిక ఘటనలో గాయపడిన చెంచు మహిళను అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు పరామర్శించారు. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన ఆదివాసీ మహిళా ఈశ్వరమ్మను గత ఏడు రోజుల క్రితం కొందరు దుండగులు ఆమె కాళ్లు చేతులు కట్టేసి పాశవిక దాడి చేశారు. దీంతో ఈశ్వరమ్మ తీవ్రంగా గాయపడింది.

ఈ ఘటనపై స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణరావు బాధితురాలిని పరామర్శించి, దోషులకు కఠిన శిక్ష పడేలా చర్చలు తీసుకుంటామని తెలపారు. ప్రభుత్వం తరుపున రూ.4 లక్షల పరిహారం ఇస్తామని, పిల్లలకు చదువుకు అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని హమీ ఇచ్చారు. ఆమెకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.