2 April, 2026 | 2:08 AM

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం

02-04-2026 12:09 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండ లం కురిక్యాల గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అర్కుటి భూధమ్మ, ఆదుర్తి కళ్యాణి ఎల్లయ్య, ఆదుర్తి కళ కిషన్, కనుకుంట్ల మైహిత రాజశేఖర్ గృహప్రవేశం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరైనారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో చొప్పదండి నియోజకవర్గం లో రెండేళ్లలోనే అర్హులైన లబ్ధిదారులకు 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. కురిక్యాల గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 208 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 94 మంది లబ్ధిదారులు సొంత ఇంటిని నిర్మించుకొని గృహప్రవేశం చేసినట్లు తెలిపారు.

రానున్న రోజుల్లో మరింత మందికి ఇందిరమ్మ ఇండ్లను అందజేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లో నిరుపేదల సొంటింటి కలను నిజం చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో అంబటి రజిత, ఎండిఓ దామ్ రాము, స్థానిక సర్పంచ్ కడారి హారిక కనకయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు పురుమల్ల మనోహర్, సర్పంచ్లు సంఘం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, రేండ్ల శ్రీనివాస్, రామిడి రాజిరెడ్డి, బీర్ల ఆనందం,చిందం ఆంజనేయులు,మేర్జ కొండయ్య, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,మ్యాక వినోద్,అర్కుటి లింగయ్య ,రాగుల సుధాకర్, మేర్జ శ్రీనివాస్, మంత్రి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.