నేటి నుంచి లారీలు పంపిస్తాం
21-05-2026 01:19 AM
- లోకల్ ట్రాక్టర్లు, డీసీఎంలలో ధాన్యం మిల్లులకు పంపాలి
- బంగ్లా వెంకటాపూర్ ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన
- డీఆర్డీఓ జయదేవ్ ఆర్య
గజ్వేల్, మే 20: గురువారం నేటి నుంచి ధాన్యం తరలింపు కోసం ఐకెపి కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపిస్తామని సిద్దిపేట జిల్లా డిఆర్డిఓ జయదేవ్ ఆర్య రైతులకు బరోసా ఇచ్చారు. గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతుల ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నాగలక్ష్మి నర్సింలు డిఆర్డిఓ జయదేవ్ ఆర్యను కోరారు. తాము పంపించే లారీలతోపాటు స్థానికంగా ఉండే ట్రాక్టర్లు, డీసీఎం వాహనాల ద్వారా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ఆయన వెంట ఐకెపి డిపిఎం, ఏపిఎం ఉన్నారు.






