16 April, 2026 | 1:41 AM

ఫిలిం టూరిజం అభివృద్ధికి పాటుపడతాం

16-04-2026 12:17 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 15(విజయక్రాంతి): ఫిలిం టూరిజం అభివృద్ధికి తమ వంతు శాయశక్తులా పాటు పడతామని ఎఫ్టిపిసి ఫిలిం టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ వింగ్ ఛైర్మన్ కోడే శ్రీచైతన్య, డిజిటల్ అండ్ సెలెబ్రేషన్స్ స్టేటజీ ఛైర్మన్ సీహెచ్ హరిలీలా ప్రసాద్ స్పష్టం చేశారు. ఎఫ్టిపిసి ఫిలిం టెక్నాలజీ వింగ్ ఛైర్మన్గా కోడే శ్రీ చైతన్య, డిజిటల్ అండ్ సెలెబ్రేషన్స్ స్టేటజీ ఛైర్మన్గా సీహెచ్ హరిలీలా ప్రసాద్  నియమితులైన సందర్భంగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్టిపిసి) ఆధ్వర్యం లో ఫిలిం టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ విం గ్కు ఛైర్మన్ నియామకాన్ని పురస్కరించుకుని ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని బుధవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రము ఖ దర్శకుడు వి.సముద్ర, గౌరవ అతిథిగా ప్రముఖ బాలివుడ్ నటి అనీషా ముఖ ర్జితో కలసి నియామక పత్రాలను అందజేశారు. ప్రత్యేక అతిథులుగా బిగ్బాస్ షానీ, నటి సేజ ల్, అన్నంగి రాజశేఖర్, జి.మధుకర్, ఎం. ఈశ్వరరావు, స్వప్న కాస్వ, కిరణ్ బెజాడి, రామిశెట్టి అప్పారావు శుభాకాంక్షలు తెలిపారు.