కాంగ్రెస్‌కే మద్దతిస్తాం..
21-05-2024 02:00 AM
సీపీఎం రాష్ట్ర నాయకురాలు మల్లు లక్ష్మి
సూర్యాపేట, మే20 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ని కల్లో కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నకు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మీ స్పష్టం చేశారు. సూర్యాపేట పట్టణంలో జరిగిన సమావేశంలో ఆమె ఈ మేరకు వెల్లడించారు. లౌకిక విలువలు, ప్రజాస్వా మ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నామని అన్నారు. అదే క్రమం లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. పట్టభద్రలు కాంగ్రెస్‌కు ఓటే యాలని కోరారు.






