17-07-2025 12:28:52 AM
- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజాపూర్ జూలై 16: ఎర్ర మల్లయ్యను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. బుధవారం కుచ్చర్ కల్ గ్రామ శివారులోగొర్రెపిల్లలు మృతి చెందిన సంఘటన స్థలాన్ని సందర్శించి గొర్రెల కాపరి ఎర్ర మల్లయ్యతో గొర్రెల మృతికి కారణం అయిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తక్షణ సాయం కోసం రూ.25 తన సొంత నిధులతో అందించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుని న్యాయం చేసేందుకు కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి, యాదయ్య, విక్రమ్ రెడ్డి, సాయి కుమార్, సత్యం,కృష్ణయ్య గౌడ్,రమేష్ తదితరులుపాల్గొన్నారు.