17-07-2025 12:28:57 AM
ధర్పల్లి జూలై 1౬ (విజయ క్రాంతి): ధర్పల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారులు వర్షం నీళ్ళు నిలిచి గుంతలతో ప్రమాదకరంగా మారయి. నీటితో నిండి ఉన్న రోడ్డు లో ఉన్న గుంతల్లో వాహన దారులు మదాలకు గురవుతున్నారు. గత ప్రభుత్వం పాలనలో రోడ్ల దుస్థితి అధ్వానంగా మారింది. ప్రభుత్వం మారిన రోడ్ల పరిస్థితి అదోగతి. మారకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఎన్నికల ముందు వాగ్దానాలు చేసే ప్రజాప్రతినిధులు ఎన్నికల తర్వాత పట్టించుకోవడం లేదని ధర్పల్లి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రయాణించే ప్రధాన రహదారులే అధ్వానంగా మారినప్పటికిని వాటి మరమ్మత్తులకు ఉపక్రమించడం లేదు. ఇదే రోడ్డుపై రూరల్ నియోజకవర్గం లోని రూరల్ ఎమ్మెల్యేలు తరచూ ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు.
అయినా రోడ్లపై దృష్టి సాధించడం లేదు. ప్రజా ప్రతినిధులు ఎలక్షన్లలో ఇచ్చే హామీలను నెరవేర్చే దిశగా ప్రారంభించిన సీసీ రోడ్ల పనులు సైతం నత్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి. ఇకనైనా ప్రజా ప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకుని రోడ్ల మరమ్మత్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
రూరల్ నియోజకవర్గం లోని ఒక గ్రామంలో గుంతల రోడ్లపై ప్రయాణించే నిండు గర్భవతి ప్రాణాలు విడిచిన సంఘటన మరువకముందే గుంతల మైన రోడ్డుపై ప్రమాదాలకు గురై ఎందరో ప్రాణాలను వదులు కోగా మరి కొందరు ప్రమాదాల మారినపడి వికలాంగులుగా మారారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సమస్యపై స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులను చేపట్టవలసిందిగా ధర్పల్లి మండల ప్రజలు కోరుతున్నారు.