20 March, 2026 | 8:28 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

పత్తి మార్కెట్‌ను వినియోగంలోకి తీసుకొస్తాం

31-10-2024 12:00 AM

గజ్వేల్ పత్తి మార్కెట్‌ను సందర్శించిన ఏఎంసీ పాలకమండలి

గజ్వేల్, అక్టోబర్ 30: గజ్వేల్‌లో నిరుపయోగంగా ఉన్న పత్తి మార్కెట్ యార్డుపై విజయక్రాంతి దినపత్రికలో ఈ నెల 25వ తేదీన ‘నిర్మించారు.. నిరుపయోగంగా వదిలేశారు’ అనే శీర్షి కన ప్రచురితమైన కథనానికి గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం స్పందిం చింది. పత్తి మార్కెట్ యార్డును బుధవారం ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ సర్దార్‌ఖాన్, ఏఎంసీ కార్యదర్శి జాన్‌వెస్లీ, డైరెక్టర్లు పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్ యార్డు ప్రహరీ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేసి పత్తి మార్కెట్ యార్డును త్వరలో వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని తెలిపారు.