12 March, 2026 | 1:40 AM

కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా

19-06-2025 12:06 AM

-గిగ్ వర్కర్స్ పాలసీపై త్వరలోనే సదస్సు

- కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): రాష్ర్టంలో ఇప్పటికే ఉన్న కార్మిక సంక్షేమ పథకాలు, చట్టాలను పటిష్టంగా అమలు చేసి కార్మికులకు అండగా ఉంటానని కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో మంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా టాటా టెక్నాలజీస్‌తో కలిసి ఐటీఐలలో 46 స్కిల్ డెవలప్మెంట్‌కు సంబంధించిన మొదటి ఫైల్‌పై ఆయన సంతకం చేశారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు రాష్ర్టంలో గిగ్ వర్కర్స్ సంక్షేమానికి ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నామన్నారు. గిగ్ వర్కర్స్ పాలసీ పై త్వరలో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఇసుకను సామాన్యుల కు అందుబాటులో తెస్తామని, ఇసుకపై ఒక మంచి పాలసీ ఏర్పాటు చేస్తామన్నారు.