16-02-2026 06:32:12 PM
ఎమ్మెల్యే కూనంనేని సహకారంతో అభివృద్ధి ఉరకలు వేయిస్తాం
ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం కార్పొరేషన్'కు తొలిసారి జరిగిన ఎన్నికల్లో సిపిఐకి ఘనవిజయాన్ని అందించిన ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మేయర్, కార్పొరేటర్ల పనితీరు ఉంటుందని, అందుకు అనుగుణంగా కమ్యూనిస్టు పార్టీ తనవంతు పాత్ర పోషిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా స్పష్టం చేశారు. సోమవారం జరిగిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం అయన మాట్లాడారు.
స్థానిక ఎమ్మెల్యే కూనంనేని కృషి, ప్రేత్యేక శ్రద్ధతో కార్పొరేషన్'ను సాధించుకున్నామని, కేంద్రం నుంచి, రాష్ట్రము నుంచి అత్యధిక నిధులు రాబట్టి కార్పొరేషన్'ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి జరుగుతుందని, గెలుపు, ఓటమిల అంశాన్ని ఎన్నికలవరకే పరిమితం చేసి, పార్టీలకతీతంగా అభివృద్ధి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. కూనంనేని సహకారంతో కార్పొరేషన్ అభివృద్ధిని ఉరకలు వేయిస్తామని తెలిపారు.
కార్పొరేషన్ మేయర్ భాధ్యతను కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి చేపట్టడం గర్వించదగ్గ విషయమని, మరింత బాధ్యతతో పని చేస్తామన్నారు. కార్పొరేషన్ పరిధిలో 23 కార్పొరేటర్ స్తనాలు అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మేయరుగా బాధ్యతలు చేపట్టిన మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారికి, బాధ్యతలు చేపట్టిన కార్పొరేటర్లకు అయన శుభాకాంక్షలు తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థుల విజయంకోసం శ్రమించిన పార్టీ, ప్రజాసంఘాలు, అభిమానులకు అయన అభినందనలు తెలిపారు.