calender_icon.png 5 December, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజిలాపురంను అభివృద్ధి పథంలోకి కృషి చేస్తా..

05-12-2025 01:32:19 AM

సర్పంచ్ అభ్యర్థి రామిడి వెంకట్‌రెడ్డి 

మర్రిగూడ, డిసెంబర్ 4 (విజయ క్రాంతి): నల్లగొండ_రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో వెనుకపాటు గురైఉన్న అజలాపురం గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానంటూ, ఆ గ్రామం పంచాయితీ సర్పంచ్ అభ్యర్థి రామిడి వెంకట్ రెడ్డి తనకు ఓటు వేసి గెలిపించాలంటూ గడపగడపకు ప్రచార నిర్వహిస్తున్నారు.గ్రామపంచాయతీ ఏర్పడినప్పటి నుండి చాలీచాలని అభివృద్ధి నిధులతో, గ్రామ ప్రజలు అభివృద్ధికి నోచుకోలేకపోయారని ఆయన అన్నారు.

ఆర్ అండ్ బి రోడ్డు నుండి నరసింహపురం మీదుగా అజిలాపురం వరకు బీటీ రోడ్డు వేయించేందుకు తక్షణం తాను గెలిచిన వెంటనే పనులు చేపడతానని ఆయన ఆ రెండు గ్రామాల ప్రజలకు కూడా హామీ ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు.  గ్రామంలో నీ  మాజీ  ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల, ప్రజల అభీష్ట మేరకు సర్పంచి ఎన్నిక కోసం నామినేషన్ వేశానని ఎన్నికల గుర్తు బ్యాట్ పై కోటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన నరసిం హపురం, అజాలాపురం  కోరుతున్నారు.