calender_icon.png 18 August, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్ లో ఘనంగా ఆయుధ పూజ..

13-10-2024 04:41:42 PM

మందమర్రి (విజయక్రాంతి): విజయదశమి (దసరా) పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణ పోలీస్ స్టేషన్ లో శనివారం ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. సీఐ కే శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ లు అదనపు ఎస్ఐ ఎన్ శ్రీనివాస్, ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి అత్యంత భక్తిశ్రద్ధలతో స్టేషన్ లో ఆయుధాలకు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య  ఆయుధపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కే శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ లు మాట్లాడుతూ.. దసరా పర్వదినం సందర్బంగా స్టేషన్ లో ఆయుధ పూజ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలందరూ దసరా వేడుకలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. సర్కిల్ పరిధిలోని ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.