13 April, 2026 | 9:05 PM

హెల్మెట్ త‌ప్ప‌ని స‌రిగా ధ‌రించాలి

13-04-2026 08:03 PM

మునిప‌ల్లి ఎస్ఐ రాజేష్ నాయ‌క్

మునిపల్లి,(విజయక్రాంతి):  వాహ‌న‌దారులంద‌రు త‌ప్ప‌ని స‌రిగా   హెల్మెట్ ధ‌రించాల‌ని మునిప‌ల్లి  ఎస్ఐ రాజేష్ నాయ‌క్ అన్నారు. మండ‌లంలోని  అల్లాపూర్ గ్రామంలో గ్రామ  స‌ర్పంచ్  అంకెన్ ప‌ల్లి  నారాయ‌ణ త‌న స్వంత  ఖ‌ర్చుల‌తో గ్రామంలోని  ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌కు హెల్మెట్ ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య  అతిథిగా ఎస్ఐ రాజేష్ నాయ‌క్ హాజ‌రై హెల్మెట్ ల‌ను అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా  ఎస్ఐ మాట్లాడుతూ హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపడం సురక్షితమన్నారు. అందుకు ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పక ధరించాలని సూచించారు. అల్లాపూర్ గ్రామంలో వాహ‌నదారుల‌కు హెల్మెట్ ల‌ను గ్రామ స‌ర్పంచ్  నారాయ‌ణ అందించ‌డం  అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. అనంత‌రం గ్రామ  స‌ర్పంచ్ అంకెన్ ప‌ల్లి నారాయ‌ణ మాట్లాడుతూ  గ్రామంలోని ద్విచ‌క్ర వాహ‌న‌దారులకు త‌న వంతుగా  హెల్మెట్  లు అందిస్తున్న‌ట్లు తెలిపారు. అందుకు ప్ర‌మాదాల  నివార‌ణకు హెల్మెట్  లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతాయ‌న్నారు.