సుబ్బు సార్ క్లాస్‌కు స్వాగతం!
సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మానసచౌదరి, బ్రహ్మానందం, మురళీశర్మ, గెటప్ శ్రీను, జీవన్ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. మల్లిక్ రామ్, రమేశ్ ఎలిగేటి, శివాని ధోబాల్ రచించిన ఈ సిరీస్‌ను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి నిర్మించారు. హాస్యం, భావోద్వేగాలు, ఆసక్తికరమైన పాత్రలతో ఈ సిరీస్ ప్రేక్షకులకు వినోదభరితమైన అనుభూతిని అందించనుంది.
ఈ కథలో సుబ్రహ్మణ్యం చిల్లుకూరి రావు అలియాస్ సుబ్బు అనే యువకుడు, మాకిపూర్ అనే గ్రామంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందుతాడు. ఎలాంటి అనుభవం లేకపోయినా, గ్రామస్తులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అడుగుపె ట్టిన సుబ్బు, అక్కడ అనుకోని సంఘటనలు, విచిత్రమైన ప్రశ్నలు, హాస్యభరిత పరిస్థి తులు, జీవితాన్ని మార్చే అనుభవాల మధ్య చిక్కుకుంటాడు. ఈ ప్రయాణంలో ప్రేమ, కుటుంబం, కెరీర్‌ను పణంగా పెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. చివరికి అతను తన జీవితంలో సరైన నిర్ణయం తీసుకోగలడా? అనేదే కథ. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్‌గా తెరకెక్కించిన ఈ సిరీస్ జూలై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.






