13 March, 2026 | 9:20 PM

కళాశాలలోని సమస్యలను పరిష్కరించాలి

02-12-2025 07:33 PM

ఎబివిపి గాంధారి శాఖ డిమాండ్

గాంధారి (విజయక్రాంతి): గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు మంగళవారం రోజున వినతిపత్రం అందించిన అనంతరం కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని, మూత్రశాలలో అపరిశుభ్రంగా ఉండటం వల్ల విద్యార్థులు అందరం బయటకి వెళ్లాల్సిన పరిస్థితి అదేవిధంగా తరగతి గదులు కూడా శుభ్రంగా లేక పోవడం, త్రాగునీరు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. చాలామంది విద్యార్థులు కూడా కళాశాలకు రానటువంటి పరిస్థితి. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.