calender_icon.png 23 October, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడారంగంలో సత్తా చాటిన విద్యార్థులకు అభినందనలు

23-10-2025 12:58:19 PM

చండూరు, (విజయక్రాంతి): చండూరు మండల కేంద్రంలో ఉన్న స్థానిక మరియానికేతన్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉడ్ బాల్- అలాగే క్రికెట్ టీం- లెవెన్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ ఇబ్రహీంపట్నం నిర్వహించిన క్రీడా పోటీలలో ఈ పాఠశాల విద్యార్థులు క్రీడారంగంలో సత్తా చాటడంతో మరియానికేతన్ పాఠశాల విద్యార్థి, విద్యార్థులను, స్కూలు యజమాన్యం, ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ సందర్భంగా ఈ పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ పద్మలత, ప్రిన్సిపాల్ సిస్టర్ కల్పన మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడలతోపాటు, విద్యారంగంలో కూడా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని వారు అన్నారు. క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని వారు అన్నారు

. భద్రాది కొత్తగూడెం నిర్వహించిన రాష్ట్ర స్థాయిలో ఉడ్ బాల్ పోటీలలో మా పాఠశాల విద్యార్థులు మూడు బంగారు పతకాలు, మూడు రజత పథకాలు సాధించడంతోపాటు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించారని వారు అన్నారు. క్రికెట్ టీం- లెవెన్ క్రికెట్ అసోసియేషన్  తెలంగాణ ఇబ్రహీంపట్నం నిర్వహించిన క్రీడా పోటీలలో కెప్టెన్ జక్కలి సాయిరాం యాదవ్ టీం మెంబర్స్ ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారని వారు విద్యార్థులను కొనియాడారు. అనంతరం క్రీడారంగంలో రాణించిన కెప్టెన్ జక్కలి సాయిరాం యాదవ్, ఎన్.నవనీత్, బి. మురళి, జే.హర్షవర్ధన్, సి హెబ్. యశ్వంత్, కే.శివానంద్, వి. రామ్ చరణ్. పి. భరత్, జి. మాన్విత్, ఎం. అక్షయ్, జె. లక్ష్మణ్, ఎండి. పుర్మోన్, బి. గణేష్, టి. భాను ప్రకాష్ లను పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సిస్టర్ పద్మలత, ప్రిన్సిపాల్ సిస్టర్ కల్పన, పి.టి. గణేష్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.