calender_icon.png 4 July, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

03-07-2025 02:13:59 AM

 - ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

జగిత్యాల, జూలై 2 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందజేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 99 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 28 లక్షల 14 వేల విలువగల చెక్కులను, 86మంది ఆడ బిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం కింద మంజూరైన రూ. 86 లక్షల 9 వేల విలువగల చెక్కులను బుధవారం జగిత్యాల పొన్నాల గార్డెన్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి, రైతు పక్ష పాతి ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఇందిరమ్మ ఇండ్లను జగిత్యాల నియోజకవర్గానికే మంజూరయ్యే విధంగా కృషి చేస్తానన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రణాళిక యుతంగా చర్యలు తీసుకుంటానన్నారు.

సన్న బియ్యం, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు, రైతురుణ మాఫీ, మహిళా సంఘాల ఆర్థిక చేయూత వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక గోదాంల నిర్మాణం జగిత్యాల నియో జకవర్గంలోనే జరుగుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్, నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, బాల ముకుందం, నారాయణ రెడ్డి, చెరుకు జాన్, తదితరులుపాల్గొన్నారు.